రాశి ఫలాలు, ఆదాయం & వ్యయం

శుభకృతు నామ సంవత్సరం వశిష్ట పంచాంగం

మేష రాశి

ఆదాయంవ్యయంరాజపూజ్యంఅవమానం
141436
  • అశ్వని 1, 2, 3, 4, పాదములు (చూ, చే, చో, లా)
  • భరణి 1, 2, 3, 4 పాదములు (లీ, లూ, లే, లో)
  • కృత్తిక 1వ పాదము (ఆ)

ఈ సంవత్సరం ఏప్రిల్ 13 న, బృహస్పతి మీన రాశిలోకి, 12వ ఇంటిలోకి, మరియు ఏప్రిల్ 12 న మేషరాశిలో, 1వ ఇంటిలోకి రాహువు మరియు తులారాశిలో, 7వ ఇంటిలో కేతువు ప్రవేశిస్తాడు. ఏప్రిల్ 29 న, శని కుంభ రాశిలోకి, 11వ ఇంటిలోకి ప్రవేశిస్తాడు మరియు జూలై 12 న, తిరోగమనం తర్వాత మకర రాశిలోకి, 10వ ఇంటిలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు సెప్టెంబర్ 30 నుండి నవంబర్ 21 వరకు అస్తంగతుడై ఉంటాడు. బృహస్పతి ఫిబ్రవరి 24 నుండి మార్చి 23 వరకు అస్తంగతుడై ఉంటాడు. అక్టోబర్ 30న కుజుడు వక్రగతుడు అవుతాడు మరియు జనవరి 13, 2023న మార్గి అవుతాడు. జూలై 29న బృహస్పతి వక్రగతుడుగా మారి నవంబర్‌ 24న మార్గీ అవుతాడు. డిసెంబర్ 19, 2021న శుక్రుడు వక్రగతుడుగా మారి, జనవరి 29, 2022న మార్గిగా మారతాడు. శని జూన్ 5న వక్రగతిని పొంది, అక్టోబర్ 23న మార్గి అవుతాడు.

2022 సంవత్సరం ఆరోగ్య జాతకం

ఈ ఏడాది ఆరోగ్యం పరంగా మిశ్రమంగా ఉంటుంది. ఏప్రిల్ వరకు బృహస్పతి రవాణా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీ ఆరోగ్యం బాగుంటుంది. అయితే, రెండవ ఇంటిలో సగటుగా ఉండే రాహు గోచారం, దంతాలు మరియు ముఖానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. బృహస్పతి యొక్క అనుకూల రవాణా కారణంగా ఈ సమస్య త్వరగా తగ్గుతుంది.

ఏప్రిల్ నుంచి గురువు పన్నెండవ ఇంటిలో మరియు రాహు జన్మ రాశిలో సంచరించడం వలన ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తల మరియు మెదడుకు సంబంధించిన ఆరోగ్య సమస్యల విషయంలో అలాగే మానసిక ఆందోళన విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఏ విషయం లో అయినా ఆవేశానికి గురి కాకుండా శాంతంగా ఉండి మీ మానసిక ఆందోళనలను పెంచుకోకుండా ఉండటం మంచిది. జన్మస్థానంలో రాహు సంచారం కారణంగా మానసిక ఆందోళన ఆవేశం పెరిగే అవకాశం ఉంటుంది. పన్నెండవ ఇంటిలో గురువు గోచారం కారణంగా రక్తపోటుకు సంబంధించిన వ్యాధులకు గురవుతారు కనుక, మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా జూలై మరియు డిసెంబర్ మధ్య కాలంలో, మీరు శారీరక రుగ్మతలు మరియు మానసిక ఉద్రిక్తతతో బాధపడాల్సి రావచ్చు. ఆరోగ్య విషయంలో ఆవేశానికి లోను కాక పోవటం, ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది. మీ ఆవేశం మీ ఆరోగ్యాన్ని చెడగొడుతుంది అన్న విషయాన్ని ఈ సంవత్సరమంతా గుర్తుపెట్టుకోండి.

2022 సంవత్సరం ఆర్థిక జాతకం

ఆర్థికంగా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. ఏప్రిల్ వరకు గురువు గోచారం అనుకూలంగా ఉండటం వలన ఆర్థికంగా మీరు బలమైన స్థితిలో ఉంటారు, అయితే మీ ఖర్చు మీ నియంత్రణకు మించి ఉంటుంది. రెండవ ఇంటిలో రాహు గోచారం కారణంగా కొన్నిసార్లు గొప్పలకు పోయి అనవసరంగా డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ఖర్చులకు తగినంత డబ్బు అందుబాటులో ఉండటం వలన ఈ సమయంలో ఆర్థికంగా పెద్దగా సమస్యలు ఉండవు. ఏప్రిల్ లో గురువు పన్నెండవ ఇంటిలో సంచరించడం వలన ఆర్ధిక స్థితి లో మార్పులు చోటు చేసుకుంటాయి. విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేయడం వలన ఆర్థికంగా గా కొంత ఇబ్బందికి లోనయ్యే అవకాశం ఉంటుంది. అయితే జూలై వరకు శని గోచారం అనుకూలంగా ఉండటంతో ఈ సమస్య మిమ్మల్ని పెద్దగా బాధించదు. కానీ జూలై తర్వాత మాత్రము మీ ఖర్చుల విషయంలో అదుపు లేకపోతే ఆర్థిక సమస్యలకు లోనయ్యే అవకాశం ఉంటుంది. అంతే కాక ఇతరుల మాటలు విని లేదా గొప్పలకు పోయి అప్పు తీసుకొని మరీ శుభ కార్యాలు పూర్తి చేయడం లేదా దానధర్మాలు చేయడం చేస్తారు. ఆర్థికంగా ఈ సంవత్సరం అనుకూలంగా ఉండాలి అంటే వీలైనంతవరకు గొప్పలకు పోకుండా అలాగే ఒకటికి రెండుసార్లు ఆలోచించి డబ్బు ఖర్చు చేయడం మంచిది. ఎందుకంటే గురు లాభంలో ఉన్నప్పుడు వచ్చిన డబ్బులు లేదా పెట్టుబడుల కారణంగా వచ్చిన లాభాలను అనవసరంగా పోగొట్టుకోవాల్సి వస్తుంది.

2022 సంవత్సరం ఉద్యోగ జాతకం

11వ ఇంటి పై బృహస్పతి యొక్క సంచారం మీకు విజయవంతమైన వృత్తిని అదే విధంగా ఆర్థిక అభివృద్దిని ఇస్తుంది. ఏప్రిల్ నుండి బృహస్పతి 12 వ ఇంటికి మారడంతో, వృత్తి విషయంలో చాలా అడ్డంకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏప్రిల్ నుంచి మొదటి ఇంటిపై రాహువు సంచారం మిమ్మల్ని మరింత మొండివారిగా, అహంభావులుగా మారుస్తుంది. ప్రతి విషయంలో ఎక్కువ పట్టుదలకు పోవటం, పోరాడాలని చూడటం చేస్తుంటారు. శని గోచారం 10 వ మరియు 11 వ ఇళ్లలో ఉండటం వలన వృత్తిలో అభివృద్ధిని, పేరుప్రతిష్ఠలను పొందుతారు. మీరు ఇతరులతో ప్రవర్తించే విధానంలో జాగ్రత్త వహించటం మంచిది. మీకు వచ్చిన విజయాలు మీకు గర్వాన్ని అహంభావాన్ని ఇవ్వటం వలన మీరు ఇతరులతో దురుసుగా ప్రవర్తించే అవకాశముంటుంది. ఇది మీ వృత్తిలో అదేవిధంగా వ్యక్తిగత జీవితంలో కూడా సమస్యను కలిగిస్తుంది కనుక మీరు మీ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు కొత్త ఉద్యోగం కోసం శోధిస్తున్నట్లయితే, మీ ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నిస్తున్నట్లయితే, ఈ సంవత్సరం ఏప్రిల్ లోపు అనుకూలమైన ఫలితాన్ని పొందుతారు. ఏప్రిల్ తరువాత మీ ఉద్యోగానికి సంబంధించి రిస్క్ తీసుకోవడం మంచిది కాదు. విశ్రాంతి లేని మీ పని కారణంగా మీకు చాలా మానసిక ఒత్తిడి ఉండవచ్చు. మీ అహం కారణంగా మీరు ఒకేసారి అనేక పనులు చేయడానికి ప్రయత్నిస్తారు. దాని కారణంగా మీరు వాగ్ధానం చేసిన పనిని సకాలంలో పూర్తి చేయక పోవచ్చు కనుక ఇది మీ కెరీర్ లో మీకు సమస్యను కలిగించవచ్చు. కొన్ని సార్లు మీరు అత్యాశకు లోనవటం మరియు తక్కువ సమయంలో పేరు మరియు కీర్తిని పొందడానికి ప్రయత్నిస్తారు. మీరు చేసే ప్రయత్నాల్లో విజయం సాధించడానికి మీరు స్వయంకృషిని నమ్ముకోవాలి తప్ప ప్రయత్నం లేకుండా కేవలం అదృష్టం తో సాధించాలని చూడకండి.

2022 సంవత్సరం వ్యాపారం మరియు స్వయం ఉపాధి

ఈ సంవత్సరం శని పదవ ఇంటిపై రవాణా అవుతుంది, దీని వల్ల మీకు జీవితంలో పురోగతి ఉంటుంది. మీరు వ్యాపారంలో ఆశించిన లాభాన్ని పొందుతారు మరియు దానిలో అభివృద్ధిని సాధిస్తారు. ఏప్రిల్ వరకు గురు మరియు శని దృష్టి ఏడవ ఇంటిపై ఉండటం వలన వ్యాపారంలో అనుకూలమైన మార్పులు ఏర్పడటం అలాగే సమాజంలో గుర్తింపు రావటం జరుగుతుంది. ఆర్థికంగా కూడా ఈ సమయం అనుకూలిస్తుంది. అయితే ఏప్రిల్ తర్వాత గురు పన్నెండవ ఇంటిలో సంచరించడం, కేతువు ఏడవ ఇంటిలో సంచరించడం కారణంగా వ్యాపారంలో మరియు ఆర్థికంగా కొంత సమస్యకు గురయ్యే అవకాశం ఉంటుంది. భాగస్వాముల మధ్య మనస్పర్థలు ఏర్పడడం వలన వ్యాపారంలో అనుకోని మార్పులు చోటు చేసుకుంటాయి. ఏప్రిల్ నుంచి జూలై మధ్యలో శని గోచారం అనుకూలంగా ఉండటం వలన కొంత ఆర్థిక సమస్యల నుంచి బయట పడే అవకాశం ఉంటుంది. వ్యాపార విషయంలో ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపార విషయంలో తొందర పడకుండా ఆలోచనతో ముందడుగు వేయడం మంచిది. రాజకీయాల్లో ఉన్నవారికి కొంత ముఖ్యమైన స్థానం పొందే అవకాశాలు ఉన్నాయి మరియు దీనికి సంబంధించి, మీరు కొంతమంది రాజకీయ ప్రముఖులను కలుస్తారు. కళాకారులు అలాగే స్వయం ఉపాధి ద్వారా జీవనం సాగిస్తున్న వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. కొన్ని సార్లు అనాలోచిత చర్యల కారణంగా మంచి అవకాశాలను కోల్పోతారు. మీ ప్రవర్తన విషయంలో కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. మీరు లేని గొప్పతనాన్ని ఆపాదించు కోవడం కానీ లేదా అహంకారంతో వచ్చిన మంచి అవకాశాలను వదిలించుకోవడం కానీ చేసే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో ఆచితూచి అడుగు వేయండి.

2022 సంవత్సరం కుటుంబ జాతకం

కుటుంబ జీవితం విషయంలో ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను పొందుతారు. ఏప్రిల్ వరకు గురువు చాలా అనుకూలంగా ఉండటం వలన కుటుంబంలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. మీ జీవితంలో అభివృద్ధి సాధిస్తారు. మీ కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. ఈ సమయంలో కుటుంబంలో వివాహం కానీ లేదా సంతానం కలగడం కానీ జరుగుతుంది. అయితే సంవత్సరమంతా రాహు కేతువుల గోచారం అనుకూలంగా లేకపోవడం అలాగే సప్తమ స్థానంపై శని దృష్టి కారణంగా మీ జీవిత భాగస్వామితో మీకు మనసు పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీ అతి జాగ్రత్త కానీ మీ అహంభావం కానీ మీ జీవిత భాగస్వామికి సమస్యగా మారవచ్చు. వారిపై పెత్తనం చెలాయించాలని అనుకునే బదులు వారిని అర్థం చేసుకుని మెలగడం మంచిది. ఏప్రిల్ తర్వాత గురువు గోచారం అనుకూలంగా ఉండకపోవటం వలన మీ సంతానంలో ఒకరికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. వారి విషయం లో డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. మీరు చేసే పనుల్లో కొన్ని ఆటంకాలు ఏర్పడటం వలన కలిగే అసహనం మీ కుటుంబం పై చెడు ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. దాని కారణంగా గా మీ కుటుంబంలో మీ పై ఉన్న గౌరవం తగ్గటం లేదా మిమ్మల్ని తక్కువగా చూడటం జరగవచ్చు. వీలైనంత వరకు చెప్పుడు మాటలు వినకుండా మీ ఆలోచనలను ఇతరులు ప్రభావితం చేయకుండా చూసుకోవడం వల్ల మీరు మీ ఇంటిలో ఆనందంగా ఉండగలుగుతారు. సప్తమంలో కేతు సంచారం కారణంగా మీ జీవిత భాగస్వామికి కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అయితే జూలై వరకు సమయం అనుకూలంగా ఉండటం వలన వారి విషయంలో ఎక్కువ ఆందోళన అవసరం లేదు. ఈ సంవత్సరం కొత్త పరిచయాలు స్నేహాలు ఏర్పడతాయి అలాగే పాత స్నేహితుల్లో స్నేహితుల్లో కొంత మందిని కోల్పోవడం జరుగుతుంది.

2022 సంవత్సరం విద్యార్థులు మరియు వారి చదువు

విద్యార్థులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. శని దృష్టి నాలుగవ మరియు అయిదవ ఇంటిపై ఉండటం వలన చదువు విషయంలో కొంత అలసత్వానికి, నిర్లక్ష్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. అయితే గురు దృష్టి అనుకూలంగా ఉండటం వలన కొంత ఆలస్యంగా అయినా చదువుపై శ్రద్ధ పెట్టడం వలన సమస్య నుంచి బయట పడతారు. ఉన్నత విద్య కొరకు ప్రయత్నిస్తున్న వారు ఎక్కువ శ్రమ చేయాల్సిన అవసరం ఉంది. తొందరపడి వచ్చిన మంచి అవకాశాన్ని కూడా చేజార్చుకో కుండా జాగ్రత్తగా ఉండాలి. జన్మరాశి రాశి పై రాహు గోచారం కారణంగా అహంభావం మరియు ఎవరినీ లెక్క చేయని మనస్తత్వం అలవాటు పడే అవకాశం ఉంది. మీ స్థాయికి మించి ప్రయత్నించడం ప్రయత్నించడం వలన అనుకున్న ఫలితం సాధించలేక మానసిక ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు వీలైనంత వరకు మీ పెద్దల లే లేదా గురువుల అభిప్రాయాలని కానీ సలహాని కానీ తీసుకోవడం మంచిది. దానివలన తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా తప్పుడు పనులు చేయకుండా మిమ్మల్ని మీరు కాపాడుకో గలుగుతారు. విదేశాల్లో విద్యాభ్యాసానికి ప్రయత్నిస్తున్న వారు ఏప్రిల్ మరియు జూలై మధ్యలో అనుకూల ఫలితాలు పొందుతారు. కాంపిటీటివ్ పరీక్షలు రాసే విద్యార్థులు పరీక్షల విషయంలో అసహనానికి గురికాకుండా ఓపికగా వేచి ఉండటం వలన అనుకున్న ఫలితాన్ని పొందుతారు.

2022 సంవత్సరం గ్రహదోషములు – పరిహారములు

ఈ సంవత్సరం మీరు గురువుకు, రాహువు మరియు కేతువులకు పరిహారాలు చేయడం మంచిది. ఈ సంవత్సరం ఈ మూడు గ్రహాలు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఆర్థికంగా, కుటుంబ పరంగా మరియు ఆరోగ్యపరంగా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మూడు గ్రహాలు శాంతించడానికి వీటికి జప, హోమ, దానాది పరిహారాలు ఆచరించడం మంచిది. గురు గ్రహానికి చేయవలసిన పరిహారాలు: ప్రతిరోజు మీరు, గురు గ్రహ సంబంధ స్తోత్రములు చదవడం కానీ, గురు పూజ చేయడం కానీ చేయాలి. లేదా గురు మంత్ర జపం 16,000 సార్లు చేయాలి. ఒకవేళ ఈ చెడు ప్రభావం ఎక్కువగా ఉన్నట్లయితే గురు గ్రహ జపం తో పాటుగా గురు గ్రహ శాంతి హోమం చేయించుకోవటం మంచిది. రాహు గ్రహ దోష పరిహారం కొరకు ప్రతి రాహు స్తోత్రం చదవడం కానీ, దుర్గా స్తోత్రం చదవడం గాని చేయాలి. లేదా 18,000 సార్లు రాహు మంత్ర జపం చేయాలి. రాహువు ఇచ్చే చెడు ప్రభావం అధికంగా ఉన్నట్లయితే రాహు గ్రహ శాంతి జరిపించు కోవడం మంచిది. కేతు గ్రహ దోష పరిహారం కొరకు ప్రతిరోజు కేతు స్తోత్రం పారాయణం చేయడం లేదా గణపతి స్తోత్రం పారాయణం చేయడం మంచిది. లేదా ఏడువేల సార్లు కేతుజపాన్ని చేయవచ్చు. కేతువు ఇచ్చే చెడు ప్రభావం అధికంగా ఉన్న వాళ్ళు కేతుగ్రహ శాంతి చేసుకోవడం మంచిది. మీ జాతకంలో పైన చెప్పిన గ్రహాల యొక్క దశ అంతర్దశలు ఈ సమయములో నడుస్తున్నట్లు అయితే వాటి ప్రభావము అధికంగా ఉంటుంది. పైన చెప్పిన పరిహారములు మీ శక్తి, భక్తి మరియు శ్రద్ధ మేరకు ఏ పరిహారం అయినా పాటించవచ్చు. అంతేకానీ చెప్పిన పరిహారములు అన్ని పాటించమని చెప్పడం లేదు. ఈ గ్రహాల పరిహారాలు తో పాటుగా వీలైనంత వరకూ తోచిన విధంగా అవసరం ఉన్నవారికి సేవ చేయడం మంచిది.

మరోక రాశిని ఎంచుకోండి