రాశి ఫలాలు, ఆదాయం & వ్యయం

శుభకృతు నామ సంవత్సరం వశిష్ట పంచాంగం

సింహ రాశి

ఆదాయంవ్యయంరాజపూజ్యంఅవమానం
81415

మఖ 4 పాదాలు (మ, మి, ము, మే),
పుబ్బ 4 పాదాలు (మో, ట, టి, టు)
ఉత్తర 1వ పాదం (టె)

ఈ సంవత్సరం ఏప్రిల్ 13 న, బృహస్పతి మీన రాశిలోకి, 8వ ఇంటిలోకి, మరియు ఏప్రిల్ 12 న మేషరాశిలో, 9వ ఇంటిలోకి రాహువు మరియు తులారాశిలో, 3వ ఇంటిలో కేతువు ప్రవేశిస్తాడు. ఏప్రిల్ 29 న, శని కుంభ రాశిలోకి, 7వ ఇంటిలోకి ప్రవేశిస్తాడు మరియు జూలై 12 న, తిరోగమనం తర్వాత మకర రాశిలోకి, 6వ ఇంటిలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు సెప్టెంబర్ 30 నుండి నవంబర్ 21 వరకు అస్తంగతుడై ఉంటాడు. బృహస్పతి ఫిబ్రవరి 24 నుండి మార్చి 23 వరకు అస్తంగతుడై ఉంటాడు. అక్టోబర్ 30న కుజుడు వక్రగతుడు అవుతాడు మరియు జనవరి 13, 2023న మార్గి అవుతాడు. జూలై 29న బృహస్పతి వక్రగతుడుగా మారి నవంబర్‌ 24న మార్గీ అవుతాడు. డిసెంబర్ 19, 2021న శుక్రుడు వక్రగతుడుగా మారి, జనవరి 29, 2022న మార్గిగా మారతాడు. శని జూన్ 5న వక్రగతిని పొంది, అక్టోబర్ 23న మార్గి అవుతాడు.

2022 సంవత్సరం ఉద్యోగ జాతకం
సింహ రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం ప్రథమార్థం అనుకూలంగా ఉంటుంది, అలాగే ద్వితీయార్ధంలో కొన్ని ఆర్థిక సమస్యలు మరియు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. వృత్తి పరంగా ఈ సంవత్సరం మీకు అనుకూలంగా ఉంటుంది. సంవత్సరం ప్రథమార్ధంలో వృత్తిలో అభివృద్ధి చూడగలుగుతారు. గురు గోచారం మరియు శని గోచారం అనుకూలంగా ఉండటం వలన మీరు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. మీరు చేసే పనులకు మీ పై అధికారుల మరియు సహోద్యోగుల సహాయ సహకారాలు అందుతాయి. మీ ఆలోచనలు, ప్రణాళికలు మీ వృత్తిలో అభివృద్ధికి కారణం అవుతాయి. మీకు చెడు చేయాలనే ఆలోచన ఉన్న వారు కూడా ఏమీ చేయలేక మౌనంగా ఉండి పోతారు. పదవ ఇంటిలో రాహు గోచారం మీకు పేరు, ప్రతిష్టలను తెచ్చిపెడుతుంది. ఇతరులు చేయలేని పనులను ధైర్యంగా, మొండిగా పూర్తి చేయడం వలన ప్రశంసలు అందుకుంటారు. ఏప్రిల్లో రాహు,కేతువులు, శని మరియు గురువు రాశి మారడం వలన పరిస్థితులు మారతాయి. గతంలో ఉన్న ప్రేమాభిమానాలు, గౌరవం తగ్గే అవకాశం ఉంటుంది. మీరు చేపట్టిన పనుల్లో అడ్డంకులు రావడం సమయానికి పనులు పూర్తి కాక పోవడం వలన మీ పై అధికారుల కోపానికి గురవుతారు. అంతేకాకుండా రావలసిన ప్రమోషన్ కానీ, వృత్తిలో మార్పు ఆగిపోవడం లేదా వాయిదా పడడం జరుగుతుంది. మీపై ఈర్ష్య కారణంగా సహోద్యోగులు లేదా రహస్య శత్రువులు మీ గురించి చెడుగా గోచారం చేయడం కానీ మీకు హాని చేయాలని చూడటం కానీ చేసే అవకాశం ఉంటుంది. గతంలో చేసిన విధంగా ఇప్పుడు చేపట్టిన పనులు చేయలేకపోవడంతో మీరు పనిచేసే ప్రదేశంలో నిరాదరణకు గురవుతారు. అయితే జూలై నుంచి మళ్లీ శని గోచారం అనుకూలంగా రావడం వలన వృత్తిలో ఉండే సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా ఈ సమయంలో వేరే ప్రదేశంలో పని చేయడానికి వెళ్ళవలసి వస్తుంది. మీకు ఇష్టం కాకపోయినప్పటికీ ఈ పని చేయవలసి వస్తుంది. వృత్తిలో మార్పు కోరుకునేవారు ప్రథమార్ధంలో దానిపై ప్రయత్నించడం మంచిది. ద్వితీయార్ధంలో ముఖ్యంగా ఏప్రిల్ మరియు జూలై మధ్యలో వృత్తి విషయంలో ఎటువంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకోకపోవటం మంచిది. ఈ సంవత్సరం పదోన్నతి కారణంగా పని ఒత్తిడి పెరగడమే కాకుండా ఆ పదోన్నతి ఆర్థికంగా పెద్దగా ఉపయోగపడేదిగా ఉండదు. అయితే ఈ మార్పు భవిష్యత్తుకు సహాయకారిగా ఉంటుంది. ఏప్రిల్ నుంచి కేతు గోచారం మూడవ ఇంటిలో అనుకూలంగా ఉండటం వలన మీకు వచ్చే సమస్యల నుంచి బయటపడటానికి అవకాశాలు వస్తాయి. అలా వచ్చిన అలా వచ్చిన సమస్యలను ధైర్యంగా ఎదుర్కొన గలుగుతారు. కొత్తగా ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తున్న వారు ప్రథమార్ధంలో అనుకూల ఫలితాలు పొందుతారు. ద్వితీయార్ధంలో జులై తర్వాత కూడా కొత్తగా ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తున్న వారికి అనుకూలమైన ఫలితం లభిస్తుంది.

2022 సంవత్సరం కుటుంబ జాతకం
ఈ సంవత్సరం కుటుంబ పరంగా మిశ్రమంగా ఉంటుంది. ఏప్రిల్ వరకు గురు గోచారం ఏడవ ఇంటిలో అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీ జీవితభాగస్వామి నుండి సహాయ సహకారాలు, ప్రేమాభిమానాలు అందుకుంటారు. ఈ సమయంలో గతంలో ఏర్పడిన మనస్పర్థల తొలగిపోయి ఆనందకరమైన జీవితం అనుభవిస్తారు. గురు దృష్టి మూడవ మరియు పదకొండవ ఇంటిపై ఉండటం వలన మీ తోబుట్టువులు అభివృద్ధి చెందడమే కాకుండా వారి ద్వారా సహాయ సహకారాలు పొందుతారు. ఈ సమయంలో శుభకార్యాల్లో పాల్గొనడం కానీ, లేదా ఇంట్లో శుభకార్యాలు జరగడం కానీ ఉంటుంది. మీరు ఆనందంగా ఉండటమే కాకుండా మీ కుటుంబ సభ్యులను కూడా ఆనందంగా ఉంచే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ మీరు సంతానం గురించి కానీ, వివాహం గురించి కానీ ఎదురు చూస్తూ ఉన్నట్లయితే ఈ సమయంలో అనుకూలమైన ఫలితాన్ని పొందుతారు.

ఏప్రిల్ నుంచి జూలై మధ్య కాలంలో కుటుంబంలో ప్రశాంతత లోపించే అవకాశం ఉంటుంది. గురువు మరియు శని గోచారం అనుకూలంగా లేకపోవడం వలన భార్యాభర్తల మధ్య అపార్థాలు ఏర్పడటం లేదా కుటుంబ సభ్యుల మధ్య గొడవలు పెరగడం జరగవచ్చు. మానసికంగా మీలో అశాంతి, అపనమ్మకం ఎక్కువ అవుతాయి దాని కారణంగా కుటుంబ సభ్యులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. మీ మాటకు విలువ ఇవ్వడం లేదనే భావన మీ లో ఎక్కువ అవుతుంది. దాని కారణంగా మీ కుటుంబ సభ్యుల పై ఒత్తిడి పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు రావడం లేదా మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆరోగ్య సమస్యలు రావటం వలన ఇంటిలో ప్రశాంతత లోపిస్తుంది. ఈ సమయంలో ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా ఉండి మీ బాధ్యతలను సక్రమంగా నిర్వహించడం వలన మీ కుటుంబ సభ్యుల ప్రేమాభిమానాలను పొందే అవకాశం ఉంటుంది.

జులై తర్వాత గురు గోచారం అనుకూలంగా లేనప్పటికీ, శని గోచారం బాగుండటం వలన కుటుంబంలో సమస్యలు తగ్గుముఖం పడతాయి. మీ జీవిత భాగస్వామితో ఉన్న గొడవలు తగ్గిపోతాయి. ఇంట్లో ప్రశాంతత ఏర్పడుతుంది. మీ జీవిత భాగస్వామికి వృత్తిలో అభివృద్ధి లభిస్తుంది. అలాగే మీ వారసత్వ ఆస్తులు కానీ, కోర్టు తదితర వివాదాల కారణంగా ధనా దాయం కానీ లభిస్తుంది. మీ సంతానం కారణంగా మీకు ఆనందం లభిస్తుంది. వారు వారి, వారి రంగాల్లో అభివృద్ధి సాధిస్తారు

2022 సంవత్సరం ఆర్థిక జాతకం
ఈ సంవత్సరం సింహ రాశి వారికి ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది. ఏప్రిల్ వరకు గురువు మరియు శని అనుకూలంగా ఉండడంతో ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగం ద్వారా కానీ, వ్యాపారం ద్వారా కానీ ఆదాయం పెరుగుతుంది. గతంలో చేసిన పెట్టుబడుల నుంచి కూడా మంచి ఆదాయం లభిస్తుంది. ఈ సమయంలో ఇల్లు కాని, వాహనం కానీ కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీ జీవిత భాగస్వామి అని లేదా వారసత్వ ఆస్తుల ద్వారా గాని ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఆరవ ఇంటిలో శని గోచారం అనుకూలంగా ఉన్నందున గతంలో మీకు రావాల్సిన డబ్బులు తిరిగి రావడమే కాకుండా మీరు చెల్లించాల్సిన బ్యాంకు లోన్ లు కానీ, అప్పులు కానీ తిరిగి చెల్లించే గలుగుతారు. ఏప్రిల్ నుంచి గురు గోచారం మరియు ఏప్రిల్ – వై జూలై మధ్యలో శని గోచారం అనుకూలంగా లేకపోవడం వలన ఈ సమయంలో అనుకోని ఖర్చులు పెరుగుతాయి. చెల్లించవలసిన దానికంటే ఎక్కువ చెల్లించాల్సి రావడం అలాగే ఫైన్ లు టాక్స్ ల రూపంలో కూడా డబ్బులు చెల్లించాల్సి రావడం వలన ఆర్థికంగా కొంత ఇబ్బందికి గురికావలసి వస్తుంది. ముఖ్యంగా అష్టమ స్థానంలో గురువు గోచారం ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండవలసిన అవసరాన్ని గుర్తు చేస్తుంది. ఈ సమయంలో తొందరపడి పెట్టుబడులు పెట్టడం చేయకండి. ఇప్పుడు వచ్చే అవకాశాల్లో చాలా మటుకు నష్టం చేసేవే అవుతాయి తప్ప మీకు ఆర్థికంగా లాభం చేకూర్చవు. జూలై తరువాత శని గోచారం తిరిగి ఆరవ ఇంటికి రావడం వలన ఆర్థిక నష్టాల నుంచి బయట పడగలుగుతారు. ఈ సమయంలో ఆర్థికంగా బ్యాంకుల నుంచి కానీ మిత్రుల నుంచి కానీ సాయం ఉంది మీరు కట్టవలసిన డబ్బులు సమయానికి తిరిగి ఇవ్వగలుగుతారు. ఇంట్లో శుభకార్యాలు లేదా కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంగా డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది. వీలైనంతవరకు ఈ సంవత్సరం ఆర్థిక విషయాల్లో తొందర పడకుండా ఖర్చు చేయడం మంచిది.

2022 సంవత్సరం ఆరోగ్య జాతకం
సింహ రాశి వారికి ఈ సంవత్సరం ఈ విషయంలో మిశ్రమంగా ఉంటుంది. ప్రథమార్ధంలో ఏప్రిల్ వరకు గురు మరియు శని గ్రహ గోచారం అనుకూలంగా ఉండటం వలన ఆరోగ్య విషయంలో సమస్యలు ఎక్కువగా ఉండవు. నాలుగవ ఇంటిలో కేతు గోచారం కారణంగా కడుపు మరియు ఊపిరితిత్తులకు సంబంధించిన చిన్న ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో గురువు మరియు శని అనుకూలంగా ఉంటారు కాబట్టి ఈ సమస్యలు వచ్చినా ఎక్కువగా బాధించవు. ఏప్రిల్ నుంచి జూలై మధ్యలో శని మరియు గురువు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. కాలేయం, ఎముకలు, వెన్నెముకకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా మూత్రపిండాలు మరియు గుండెకు సంబంధించిన ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్త అవసరం. జూలై నుంచి మళ్ళీ శని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. అష్టమ గురువు కారణంగా మీ ఆహార అలవాట్లను, జీవనశైలిలో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ప్రభావం తగ్గటానికి ప్రతిరోజు మానసిక ఒత్తిడి తగ్గడానికి అలాగే ఆరోగ్యంగా ఉండడానికి యోగా, ధ్యానం లాంటి వాటిని ప్రతిరోజు చేయడం మంచిది.

2022 సంవత్సరం వ్యాపారం మరియు స్వయం ఉపాధి
ఈ సంవత్సరం వ్యాపారస్తులకు అంతగా అనుకూలించదు. ప్రథమార్థంలో ఏప్రిల్ వరకు వ్యాపారంలో మంచి అభివృద్ధి లభిస్తుంది. ఆర్థికంగా కూడా ఈ సమయం అనుకూలిస్తుంది. దీని వలన మీరు అనుకున్న విధంగా మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేయగలుగుతారు. ఈ సమయం లో రాహువు గోచారం కూడా అనుకూలంగా ఉండటం వలన మీ వ్యాపారం మంచి గుర్తింపు లోకి వస్తుంది. మీ పనులన్నీ ఉత్సాహంగా, శ్రద్ధగా పూర్తి చేయగలుగుతారు. ఈ సమయంలో శని గోచారం కూడా అనుకూలంగా ఉండటం వలన మీ పని వారి సహకారం మీకు బాగా ఉంటుంది. ప్రస్తుతం చేస్తున్న వ్యాపారంతో పాటుగా అదనంగా వ్యాపారం చేయడం కానీ లేదా కొత్త ప్రదేశంలో మీ వ్యాపారం ప్రారంభించడం కానీ చేస్తారు.

ఏప్రిల్ లో గ్రహ స్థితి మారటం వలన వ్యాపారంలో అనుకోని మార్పులు చోటు చేసుకుంటాయి. మీ వ్యాపార వలన భాగస్వామి కాని లేదా గతంలో చేసిన పెట్టుబడుల్లో నష్టం ఏర్పడడం వలన కానీ వ్యాపారంలో కొంత ఇబ్బందికరంగా మారుతుంది. ముఖ్యంగా ఏప్రిల్ మరియు జూలై మధ్యన గోచారం అనుకూలంగా లేకపోవడం వలన వ్యాపారంలో నష్టపోవడం కానీ, తక్కువ లాభంతో వ్యాపారం చేయవలసి రావడం గానీ జరగవచ్చు. ఈ సమయంలో వీలైనంత వరకూ కొత్తగా పెట్టుబడి పెట్టకుండా ఉండటం మంచిది. అంతే కాకుండా గతంలో మీ వ్యాపార భాగస్వామి గా ఉండి ఆ తర్వాత మాని వేసిన వారి నుంచి ఏవైనా న్యాయపరమైన చిక్కులు గాని ఆర్థికపరమైన చిక్కులు కానీ ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ విషయంలో పంతానికి పోకుండా సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించు కోవడం మంచిది. అలా కాకుండా వివాదాన్ని పెంచుకున్నట్లయితే మీకు ఎక్కువ నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. జూలై తరువాత శని గోచారం అనుకూలంగా మారడం వలన వ్యాపార సంబంధ సమస్యలు తగ్గుముఖం పడతాయి.

కళాకారులు మరియు స్వయం ఉపాధి ద్వారా జీవితం సాధించేవారు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను పొందుతారు. ఏప్రిల్ వరకు మంచి అవకాశాలు వచ్చి, మీరు చేసే పనికి గుర్తింపు వచ్చి ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు. మీ స్నేహితుల ద్వారా కానీ, పరిచయస్తుల ద్వారా కానీ మీకు ఈ సమయంలో అవకాశాలు వస్తాయి. ఏప్రిల్ నుంచి జూలై మధ్యలో సమయం అనుకూలంగా ఉండదు కాబట్టి వచ్చిన అవకాశాలు కొని చేజారిపోవడం కానీ, తక్కువ డబ్బులకు చేయాల్సి రావడం గానీ జరగవచ్చు. జూలై తరువాత ఈ పరిస్థితుల్లో అనుకూలమైన మార్పులు చోటుచేసుకుంటాయి.

2022 సంవత్సరం విద్యార్థులు మరియు వారి చదువు
ఈ సంవత్సరం విద్యార్థులకు మిశ్రమంగా ఉంటుంది. ప్రథమార్ధంలో గురు దృష్టి లగ్నం పై ఉండటం వలన చదువుపై శ్రద్ధ పెట్టగలరు. అలాగే మీరు రాసే పరీక్షల్లో విజయం సాధించగలుగుతారు. అంతేకాకుండా మీ తోటి వారికి చదువు విషయంలో సహాయం చేసి వారి మన్ననలు పొందుతారు. నాలుగవ ఇంటిలో కేతు గోచారం కారణంగా చదువు విషయంలో ఎక్కువ ఆందోళనకు గురవుతారు. అతి భయం కారణంగా పరీక్షలలో తప్పులు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి చదువు విషయంలో ధైర్యం కోల్పోకుండా ఉండటం మంచిది. ఏప్రిల్ నుంచి జూన్ మధ్య గురు, మరియు శని గోచారం వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, చతుర్ధ స్థానం నుంచి కేతువు మూడవ ఇంటికి వెళ్లడం వలన చదువు విషయంలో ఉన్న ఆందోళన తొలగిపోతుంది. అలాగే నాలుగవ ఇంటిపై గురు మరియు శని దృష్టి కారణంగా చదువుపై శ్రద్ధ పెరిగినప్పటికీ బద్దకం కారణంగా వాయిదా వేసే స్వభావం కూడా అలవడుతుంది. జూలై తరువాత శని దృష్టి నాలుగవ ఇంటిపై ఉండక పోవడం వలన చదువు సానుకూలంగా కొనసాగుతుంది. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు ఈ సంవత్సరం ప్రథమార్థం అనుకూలంగా ఉన్నప్పటికీ ద్వితీయార్ధంలో ఎక్కువ కష్టపడాల్సి రావచ్చు. మీ నమ్మకాన్ని మరియు ధైర్యాన్ని కోల్పోకుండా ప్రయత్నించినట్లయితే అనుకూలమైన ఫలితాలు పొందుతారు.

2022 సంవత్సరం గ్రహదోషములు – పరిహారములు
ఈ సంవత్సరం, సింహ రాశిలో జన్మించిన వారికి గురువు, శని, మరియు కేతువు అనుకూలంగా ఉండరు కాబట్టి ఈ మూడు గ్రహాలకు పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది. సంవత్సర ప్రథమార్ధంలో కేతు గోచారం నాలుగవ ఇంటిలో అనుకూలంగా ఉండకపోవటం ఆరోగ్య సమస్యలు మరియు చదువులో ఆటంకాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ దోష నివారణకు గాను ప్రతిరోజు గణపతి స్తోత్ర పారాయణం చేయడం లేదా కేతు స్తోత్రం పారాయణం చేయటం మంచిది. కేతు గ్రహ ప్రభావం అధికంగా ఉన్నట్లయితే 7,000 సార్లు కేతు జపం చేయటం మంచిది. ఏప్రిల్ నుంచి గురు గోచారం బాగుండదు కాబట్టి అష్టమ స్థానంలో సంచరించే గురువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గటానికి ప్రతిరోజు గురు స్తోత్ర పారాయణం చేయడం కానీ, గురు చరిత్ర పారాయణం చేయడం కానీ మంచిది. అష్టమ గురువు ఇచ్చే చెడు ఫలితం అధికంగా ఉన్నట్లయితే 16,000 సార్లు గురు మంత్ర జపం చేయడం కానీ లేదా గురు గ్రహ శాంతి హోమం జరిపించడం కానీ మంచిది. ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి జూలై మధ్యలో శని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో శని ప్రభావం తగ్గటానికి ప్రతిరోజు శని స్తోత్ర పారాయణం చేయటం కానీ హనుమాన్ స్తోత్రం పారాయణం చేయడం కానీ మంచిది. దీని వలన శని ఇచ్చే చెడు ప్రభావం తగ్గుతుంది . మీ జాతకంలో పైన చెప్పిన గ్రహాల యొక్క దశ అంతర్దశలు ఈ సమయములో నడుస్తున్నట్లు అయితే వాటి ప్రభావము అధికంగా ఉంటుంది. పైన చెప్పిన పరిహారములు మీ శక్తి, భక్తి మరియు శ్రద్ధ మేరకు ఏ పరిహారం అయినా పాటించవచ్చు అంతేకానీ చెప్పిన పరిహారములు అన్ని పాటించమని చెప్పడం లేదు. ఈ గ్రహాల పరిహారాలు తో పాటుగా వీలైనంత వరకూ ఈ పరిణామాలతో పాటుగా తోచిన విధంగా అవసరం ఉన్నవారికి సేవ చేయడం మంచిది.

మరోక రాశిని ఎంచుకోండి