| ఆదాయం | వ్యయం | రాజపూజ్యం | అవమానం |
|---|---|---|---|
| 5 | 5 | 5 | 2 |
పునర్వసు 4వ పాదము (హి)
పుష్యమి 1, 2, 3, పాదములు (హు, హె, హో, డా)
ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు (డీ, డు, డే, డో)
ఈ సంవత్సరం ఏప్రిల్ 13 న, బృహస్పతి మీన రాశిలోకి, 9వ ఇంటిలోకి, మరియు ఏప్రిల్ 12 న మేషరాశిలో, 10వ ఇంటిలోకి రాహువు మరియు తులారాశిలో, 4వ ఇంటిలో కేతువు ప్రవేశిస్తాడు. ఏప్రిల్ 29 న, శని కుంభ రాశిలోకి, 8వ ఇంటిలోకి ప్రవేశిస్తాడు మరియు జూలై 12 న, తిరోగమనం తర్వాత మకర రాశిలోకి, 7వ ఇంటిలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు సెప్టెంబర్ 30 నుండి నవంబర్ 21 వరకు అస్తంగతుడై ఉంటాడు. బృహస్పతి ఫిబ్రవరి 24 నుండి మార్చి 23 వరకు అస్తంగతుడై ఉంటాడు. అక్టోబర్ 30న కుజుడు వక్రగతుడు అవుతాడు మరియు జనవరి 13, 2023న మార్గి అవుతాడు. జూలై 29న బృహస్పతి వక్రగతుడుగా మారి నవంబర్ 24న మార్గీ అవుతాడు. డిసెంబర్ 19, 2021న శుక్రుడు వక్రగతుడుగా మారి, జనవరి 29, 2022న మార్గిగా మారతాడు. శని జూన్ 5న వక్రగతిని పొంది, అక్టోబర్ 23న మార్గి అవుతాడు.
2022 సంవత్సరం ఉద్యోగ జాతకం
కర్కాటక రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రథమార్ధంలో రాహువు గోచారం, ద్వితీయార్ధంలో గురువు గోచారం అనుకూలంగా ఉండటం వలన వృత్తిలో మరియు వ్యక్తిగత జీవితంలో అనుకూలమైన ఫలితాలు పొందుతారు. ఉద్యోగ పరంగా ఈ సంవత్సరం ప్రథమార్ధంలో కొంత వ్యతిరేక ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా శని గోచారం అనుకూలంగా లేకపోవడం వలన ఉద్యోగంలో ఎక్కువ పని ఒత్తిడి అలాగే చేసిన పనికి సరైన గుర్తింపు లేకపోవడం జరుగుతుంది. అయితే రాహువు అనుకూలంగా ఉండటం వలన ఒత్తిడి ఉన్నప్పటికీ ఉత్సాహం తగ్గకుండా పని చేయగలుగుతారు. ఏడవ ఇంటిలో శని గోచారం వలన మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు, చిరాకు కలిగించే వారు మీ వృత్తి ప్రదేశంలో ఎక్కువ అవుతారు. మీ పనికి బదులు తమ పనిని పూర్తి చేసేలా లేదా మీ సహాయాన్ని ఎక్కువగా వాడుకునేలా మీ పైన ఒత్తిడి పెంచుతారు. మీరు వారికి సహాయం చేసినప్పటికీ వారి నుంచి ఎటువంటి కృతజ్ఞత లభించదు అంతేకాకుండా సమయం వచ్చినప్పుడు మీ గురించి చెడుగా చెప్పడం కానీ మీ వృత్తి అభివృద్ధిలో ఆటంకాలు కల్పించడం కానీ చేస్తారు. రాహు గోచారం అనుకూలంగా ఉండటం వలన ఈ విధంగా సమస్యలు సృష్టించే వారిని మీరు గుర్తించి వారిని అడ్డుకోగలుగుతారు. ద్వితీయార్ధంలో గురువు గోచారం అనుకూలంగా ఉండటం వలన వృత్తిలో మంచి అభివృద్ధిని సాధిస్తారు. ముఖ్యంగా గత సంవత్సర కాలంగా మీరు చేసిన పనికి గుర్తింపు లేక ఇబ్బంది పడినప్పటికీ, ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో ఆ గుర్తింపు లభించడమే కాకుండా, గతంలో మీరు పైన కష్టానికి ఫలితం కూడా లభిస్తుంది. ద్వితీయార్ధంలో విదేశాల్లో ఉద్యోగానికి ప్రయత్నించే వారికి అనుకూలమైన ఫలితం లభిస్తుంది. అయితే మంచి అవకాశం వచ్చినప్పటికీ అక్కడ ప్రారంభంలో కొంత ఇబ్బందికి గురి అయ్యే అవకాశం ఉంటుంది. సరైన అవకాశం వచ్చినప్పుడే బయటకు వెళ్ళటం మంచిది తప్ప, తొందరపడి సరైన అవకాశం రాకుండా వెళ్లడం మంచిది కాదు. ఈ సమయంలో మీ పెండింగ్ పనులు చాలా వరకు పూర్తి చేయబడతాయి. అలాగే కొత్త ప్రాజెక్టులు కానీ, లేదా కొత్త ఉద్యోగం రావడం కానీ జరుగుతుంది. దాని వలన మీరు ఆశించిన విజయాలను పొందుతారు. మీ హోదా లో అభివృద్ధి జరుగుతుంది అలాగే సమాజంలో పేరు ప్రతిష్టలు పొందారు. ఇతరులు చేయని లేదా ఇతరులచే సాధ్యం కాని పనులు చేయటం వలన మీరు మీరు మీ వృత్తిలో అనూహ్యమైన అభివృద్ధిని సాధిస్తారు అంతేకాకుండా మీ పై అధికారుల ప్రశంసలు కూడా అందుకుంటారు.
2022 సంవత్సరం ఆర్థిక జాతకం
ఈ సంవత్సరం ఆర్థికంగా మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఏప్రిల్ వరకు రాహు గోచారం, ఏప్రిల్ నుంచి గురు గోచారం అనుకూలంగా ఉండటం వలన ఈ సంవత్సరం గత సంవత్సరంకంటే ఆర్థికంగా మెరుగ్గా ఉంటుంది. శని గోచారం కారణంగా కుటుంబ సభ్యుల విషయంలో డబ్బు ఖర్చు పెట్టాల్సి వచ్చినప్పటికీ, ఆదాయం పెరుగుతుంది కాబట్టి ఆర్థికంగా ఇబ్బందిగా ఉండదు. ఏప్రిల్ వరకు రాహువు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి, ఈ సమయంలో పెట్టిన పెట్టుబడి నుంచి ఆదాయం రావటం, అలాగే వారసత్వ సంబంధించి ఆదాయం కానీ, ఆస్తిపాస్తులు కానీ, కలిసి రావడంతో ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. అయితే కోర్టు కేసులు గాని లేదా ఇతర వివాదాల కారణంగా ఆర్థికంగా కొంత నష్టపోవాల్సి కూడా ఉంటుంది. అంతే కాక మీ జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యల కారణంగా లేదా తండ్రిగారి ఆరోగ్యసమస్య వలన డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఏప్రిల్ నుంచి గురు గోచారం అనుకూలంగా ఉండటం వలన ఆర్థికంగా మెరుగైన పరిస్థితిలో పొందుతారు. మీ ఆదాయంలో పెరుగుదల ఉండటమే కాకుండా పితృ సంబంధ లేదా ఇతర కారణాల రీత్యా ఆదాయాన్ని లేదా స్థిరాస్తులను పొందుతారు. ఆదాయం పెరగడం వలన గతంలో తీసుకున్న బ్యాంకు లోన్ లు కానీ, ఇతర అప్పులు కానీ తీర్చ కలుగుతారు. దీని వలన ఆర్థిక ఒత్తిళ్లు తగ్గిపోయి ప్రశాంతంగా ఉండగలుగుతారు. ద్వితీయార్థంలో వాహనం కానీ, గృహ గృహం కానీ, ఇతర స్థిరాస్తులు కానీ కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. దైవ కార్యక్రమాలకు కానీ, శుభకార్యముల విషయంలో కానీ డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది.
2022 సంవత్సరం ఆరోగ్య జాతకం
ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో ప్రథమార్థం కొంత సామాన్యంగా, ద్వితీయార్ధం అనుకూలంగా ఉంటుంది. ఏప్రిల్ వరకు గురువు మరియు శని గోచారం అనుకూలంగా ఉండకపోవటం వలన ఆరోగ్యపరంగా సమస్యలు ఎదుర్కుంటారు. ముఖ్యంగా ఎముకలు, కాలేయం, వెన్నెముక సంబంధం ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అయితే ఏప్రిల్ వరకు రాహు గోచారం అనుకూలం గా ఉండటం వలన ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ సరైన సమయంలో వైద్యం అందడంతో వచ్చిన ఆరోగ్య సమస్యల నుంచి తొందరగా బయట పడగలుగుతారు. అయితే మానసికంగా ఆరోగ్య విషయంలో ఎక్కువగా ఆందోళనకు గురవుతుంటారు. ముఖ్యంగా చికిత్స విషయంలో వివిధ రకాల వైద్య పద్ధతులను పాటిస్తూ తొందరగా సమస్య తగ్గాలనే ఆత్రుత కలిగి ఉంటారు. అలాగే వ్యసనాల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. మానసిక ఆందోళనల కారణంగా వ్యసనాలకు బానిసలుగా అవటం కానీ, కొత్త వ్యసనాలు ఏర్పడటం కాని జరగవచ్చు. ఈ సమయంలో మానసికంగా దృఢంగా ఉండటం అలాగే దైవారాధన చేయటం వలన ఈ సమస్యకు గురి కాకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారు. ఈ సమయంలో గురు దృష్టి పన్నెండవ అ మరియు నాలుగవ ఇంటిపై ఉండటం వలన ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ ఎక్కువ కాలం ఆసుపత్రిలో ఉండకుండా తొందరగానే ఆరోగ్య సమస్యల నుంచి బయట పడతారు. ఏప్రిల్ నుంచి గురువు గోచారం అనుకూలంగా ఉండటం వలన ఆరోగ్యం మెరుగవుతుంది. అయితే ఏప్రిల్ చివర నుంచి జూలై వరకు గురువు గోచారం అష్టమ స్థానంలో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఎముకలు, మోకాళ్లు మరియు తలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వాహనాల విషయంలో కూడా కొంత జాగ్రత్త అవసరం.
2022 సంవత్సరం కుటుంబ జాతకం
కుటుంబ పరంగా ఈ సంవత్సరం ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం అనుకూలంగా ఉంటుంది. ఏప్రిల్ వరకు గురు గోచారం అలాగే శని గోచారం అనుకూలంగా ఉండకపోవటం వలన కుటుంబ విషయాల్లో సమస్యలను ఎదుర్కునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అవగాహన ఏర్పడటం, మనస్పర్థలు ఏర్పడటం దాని కారణంగా ప్రశాంతత లోపించడం జరుగుతుంది. ప్రతి విషయంలో మీ మాటకు, మీ పనికి ఎవరో ఒకరు అడ్డుతగలడంతో చికాకుకు లోనవుతుంటారు. అంతేకాకుండా మీరు చెప్పిన మాటలు లెక్క చేయకుండా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడటం కానీ, మీ మాటలు పట్టించుకోకుండా వారు అనుకున్న పనులు చేయడం కానీ చేస్తారు. దాని వలన ఇంట్లో ఒంటరి అయ్యాననే భావన మీ లో ఏర్పడుతుంది. దీని కారణంగా కొంత అసంతృప్తి కి మానసిక ఆందోళన కి గురవుతారు. అయితే రాహు గోచారం పదకొండవ ఇంటిలో అనుకూలంగా ఉండటం వలన మీ మిత్రుల సహకారం అందడం వలన కొంత ఆనందాన్ని, మానసిక ప్రశాంతతను పొందుతారు. ఏప్రిల్ నుంచి గురువు గోచారం అనుకూలంగా మారడం వలన గతంలో ఉన్న మనస్పర్థలు, సమస్యలు తొలగిపోతాయి. తొమ్మిదవ ఇంటిలో గురువు గోచారం కారణంగా మీకు చాలా విషయాల్లో అదృష్టం కలిసి వచ్చి గతంలో ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. మీ తండ్రిగారి నుంచి కానీ, కుటుంబ పెద్దల నుంచి కానీ సహాయ సహకారాలు అందుతాయి. దాని వలన స్థిరాస్తి కొనుగోలు కానీ, వాహన కొనుగోలు కానీ చేస్తారు. అంతేకాకుండా మీ పిల్లల వలన కూడా మీ ఆనందం రెట్టింపవుతుంది. వారి రంగాల్లో వారు సాధించిన విజయాలు మీకు గర్వ కారణం అవుతాయి. మీ జీవిత భాగస్వామితో ఉన్న సమస్యలు తొలగిపోయి ఇంటిలో ప్రశాంతత ఏర్పడుతుంది. ఒకవేళ మీరు వివాహం గురించి ఎదురు చూస్తున్నట్లు అయితే ఈ సమయంలో వివాహ యోగం ఉంటుంది. ఏప్రిల్ నుంచి జూలై మధ్య కాలంలో శని గోచారం ఇంట్లో ఉన్నప్పుడు మీ తండ్రి గారికి అనారోగ్యం ఏర్పడటం కానీ ఈ కుటుంబంలో పెద్దలకు ఆరోగ్య సమస్యలు రావడం కానీ జరుగుతుంది. అయితే గురు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమస్యలు తొందరగానే ముగిసిపోతుంది. నాలుగవ ఇంట్లో కేతు గోచారం కారణంగా ఇంటికి సంబంధించి మరమ్మతులు చేయడం కానీ లేదా కొత్త ఇంటికి మారటం కాని చేస్తారు. అలాగే మీ తల్లి గారు ఆరోగ్య విషయంలో కూడా ఏప్రిల్ నుంచి జూలై మధ్య కాలంలో కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. సంవత్సరంలో ఎక్కువ కాలం గురు గోచారం అనుకూలంగా ఉంటుంది కుటుంబంలో సమస్యలు వచ్చినప్పటికీ అవి తొందరగానే సామరస్య పూర్వంగా పరిష్కారం అవుతాయి. వీటి గురించి ఎక్కువ ఆందోళన పడవలసిన అవసరం లేదు.
2022 సంవత్సరం వ్యాపారం మరియు స్వయం ఉపాధి
ఈ సంవత్సరం వ్యాపారస్థులకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. సంవత్సరమంతా శని గోచారం అనుకూలంగా ఉండకపోవడం వలన వ్యాపారం కొంత మందకొడిగా సాగుతుంది. ఆర్థికంగా అనుకూలంగా ఉన్నప్పటికీ వ్యాపారంలో సరైన అభివృద్ధి లేకపోవడం తో కొంత నిరాశకు లోనవుతారు. ఏప్రిల్ వరకు గురు గోచారం మరియు శని గోచారం అనుకూలంగా లేకపోవడం వలన ఆర్థికంగా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది అలాగే భాగస్వాములతో సమస్యల కారణంగా వ్యాపారంలో అనుకోని మార్పులు చోటు చేసుకుంటాయి. భాగస్వాములు విడిపోవడం కానీ లేదా కొన్ని విషయాల్లో అభిప్రాయభేదాలు ఏర్పడటం కానీ జరుగుతుంది. ఈ సమస్యల కారణంగా వ్యాపారంపై ఎక్కువ దృష్టి పెట్టలేకపోతున్నారు. అయితే ఈ సమయంలో రాహు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి సమస్యలు వచ్చినప్పటికీ వాటిని సామరస్య పూర్వంగా పరిష్కరించుకోగలుగుతారు. ఏప్రిల్ నుంచి గురు గోచారం తొమ్మిదవ ఇంటిలో అనుకూలంగా ఉండడంతో వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది. అంతేకాకుండా కోర్టు కేసులు కానీ ఇతర వివాదాలు కానీ మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. భాగ్య స్థానంలో గురు సంచారం కారణంగా మీకు అదృష్టం కలిసి వచ్చి కొత్తగా ప్రారంభించిన వ్యాపారాలు కానీ, పెట్టుబడులు కానీ అనుకోని లాభాలను ఇస్తాయి. దీని వలన గతంలో ఉన్న సమస్యలు, అప్పులు తొలగిపోతాయి. అయితే శని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి కొంతమంది వినియోగదారులతో అనవసరమైన సమస్యలు ఏర్పడతాయి. అటువంటి వారి విషయంలో జాగ్రత్త అవసరం. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని అనుకునేవారు ఏప్రిల్ తర్వాత ప్రారంభించడం మంచిది. ఏప్రిల్ నుంచి రాహు గోచారం పదవ ఇంటిలో ఉండటం వలన వ్యాపారంలో మార్పులు చోటు చేసుకుంటాయి. కొత్త ప్రదేశానికి మారడం కానీ కొత్త వ్యాపారాలు చేయడం కానీ చేస్తారు. కళాకారులు కానీ స్వయం ఉపాధి ద్వారా జీవనం సాగిస్తున్న వారు కానీ ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను పొందుతారు. మంచి అవకాశాలు వచ్చినప్పటికీ వాటిని వినియోగించుకోవడంలో నిరాసక్తత ఇస్తారు. దాని వలన కొంత ఇబ్బందికి గురి అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మీకు అవకాశం ఇస్తామని మిమ్మల్ని మోసం చేసేవారు కూడా ఈ సమయంలో ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఏప్రిల్ వరకు రాహు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి అటువంటి మోసగాళ్ల బారిన పడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారు. ఏప్రిల్ నుంచి గురు గోచారం అనుకూలంగా ఉండటం వలన మీకు మంచి అవకాశాలు వస్తాయి. దాని ద్వారా డబ్బుతో పాటు పేరు ప్రతిష్ఠలు సంపాదిస్తారు. ఈ సంవత్సరం మీరు బద్ధకాన్ని విడిచిపెట్టి శ్రద్ధగా పని చేయడం వలన అభివృద్ధిని సాధిస్తారు.
2022 సంవత్సరం విద్యార్థులు మరియు వారి చదువు
ఈ సంవత్సరం విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ వారి, వారి రంగాల్లో విజయం సాధించడం వలన గతంలో వచ్చిన అపజయాలను మరిచి పోగలుగుతారు. ఏప్రిల్ వరకు రాహువు అనుకూలంగా ఉండటం వలన చదువు విషయంలో శ్రద్ధ, ఉత్సాహం కలిగి ఉంటారు. అయితే శని మరియు గురు దృష్టి నాలుగవ ఇంటిపై ఉండటం వలన కొన్నిసార్లు ఆసక్తిని మరి కొన్నిసార్లు బద్ధకాన్ని కలిగి ఉంటారు. ఈ సంవత్సరం ప్రథమార్ధంలో వాయిదా వేసే స్వభావాన్ని విడిచి చదువుపై మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఏప్రిల్ నుంచి గురు గోచారం అనుకూలంగా ఉండటం వలన చదువు విషయంలో మంచి అభివృద్ధి సాధిస్తారు. ఉన్నత విద్యకై ప్రయత్నం చేస్తున్నారు, లేదా విదేశాల్లో ఉన్నత విద్యకై ప్రయత్నం చేస్తున్న వారికి ఈ సంవత్సరం ద్వితీయార్ధంలో అనుకూల ఫలితాలు లభిస్తాయి. ఏప్రిల్ తర్వాత నాలుగవ ఇంటిలో కేతు గోచారం ఉండటం వ్యతిరేకంగా ఉండటం వలన చదువు విషయంలో అనవసరమైన ఆందోళనకు, భయానికి గురవుతారు. ముఖ్యంగా ఇంటి నుంచి దూర ప్రాంతానికి చదువులపై వెళ్లినవారు, అలాగే హాస్టల్లో ఉండి చదివే విద్యార్థులు ఈ సమయంలో తెలియని ఆందోళనకు, భయానికి గురవుతారు. వారికి తల్లిదండ్రులు ధైర్యం చెప్పి వారి భయాలు పోగొట్టడం మంచిది. పోటీ పరీక్షలు రాసే వారికి ఈ సంవత్సరం ద్వితీయార్థం అనుకూలిస్తుంది. వారి కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది.
2022 సంవత్సరం గ్రహదోషములు – పరిహారములు
ఈ సంవత్సరం, కర్కాటక రాశిలో జన్మించిన వారు, ప్రథమార్ధంలో గురువు మరియు శనికి, అలాగే ద్వితీయార్ధంలో, శని మరియు కేతువులకు పరిహార క్రియలు చేయడం మంచిది. ప్రథమార్ధంలో ఎనిమిదవ ఇంటిలో గురు గోచారం కారణంగా ఆర్థిక సమస్యలు ఏర్పడటం అలాగే ఆరోగ్య సమస్యలు ఏర్పడడం జరుగుతుంది. ఈ చెడు ప్రభావాన్ని తగ్గించుకోవడానికి గురు పరిహార క్రియలు చేయటం మంచిది. ప్రతి రోజు గురు స్తోత్ర పారాయణం చేయడం కానీ, గురు పూజ చేయడం కానీ మంచిది. చెడు ప్రభావం ఎక్కువ ఉన్నవారు 16 వేలసార్లు గురు మంత్ర జపం చేయటం కానీ లేదా గురు గ్రహ శాంతి హోమం చేయటం కానీ మంచిది. ఈ సంవత్సరమంతా శని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ప్రతిరోజూ శని స్తోత్ర పారాయణం చేయడం కానీ, హనుమాన్ స్తోత్ర పారాయణం చేయటం కానీ లేదా వెంకటేశ్వర స్వామి స్తోత్రం పారాయణం చేయడం కానీ మంచిది. శని ప్రభావం అధికంగా ఉన్నవారు 19,000 సార్లు శని మంత్ర జపం చేయడం కానీ శని గ్రహ శాంతి హోమం చేయడం కానీ మంచిది. సంవత్సర ద్వితీయార్ధంలో కేతు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ప్రతి రోజు కేతు గ్రహ స్తోత్రం పారాయణం చేయడం కానీ, గణపతి స్తోత్ర పారాయణం చేయడం కానీ మంచిది. కేతు ప్రభావం అధికంగా ఉన్నవారు 7,000 సార్లు కేతు మంత్రం జపం చేయడం కానీ కేతు గ్రహ శాంతి హోమం చేయడం కానీ మంచిది. వీటితో పాటుగా శని దోష నివారణకు శారీరక శ్రమ చేయటం, వృద్ధులకు, వికలాంగులకు సాయం చేయడం మంచిది. మీ జాతకంలో పైన చెప్పిన గ్రహాల యొక్క దశ లేదా అంతర్దశలు ఈ సమయములో నడుస్తున్నట్లు అయితే వాటి ప్రభావము అధికంగా ఉంటుంది. పైన చెప్పిన పరిహారములు మీ శక్తి, భక్తి మరియు శ్రద్ధ మేరకు ఏ పరిహారం అయినా పాటించవచ్చు అంతేకానీ చెప్పిన పరిహారములు అన్ని పాటించమని చెప్పడం లేదు. ఈ గ్రహాల పరిహారాలు తో పాటుగా వీలైనంత వరకూ తోచిన విధంగా అవసరం ఉన్నవారికి సేవ చేయడం మంచిది.