ఆదాయం | వ్యయం | రాజపూజ్యం | అవమానం |
---|---|---|---|
2 | 8 | 1 | 7 |
పూర్వాభాద్ర 4వ పాదం (ది)
ఉత్తరాభాద్ర 4 పాదాలు (దు, శం, ఝ, థ)
రేవతి 4 పాదాలు (దే, దో, చ, చి)
ఈ సంవత్సరం ఏప్రిల్ 13 న, బృహస్పతి మీన రాశిలోకి, 1వ ఇంటిలోకి, మరియు ఏప్రిల్ 12 న మేషరాశిలో, 2వ ఇంటిలోకి రాహువు మరియు తులారాశిలో, 8వ ఇంటిలో కేతువు ప్రవేశిస్తాడు. ఏప్రిల్ 29 న, శని కుంభ రాశిలోకి, 12వ ఇంటిలోకి ప్రవేశిస్తాడు మరియు జూలై 12 న, తిరోగమనం తర్వాత మకర రాశిలోకి, 11వ ఇంటిలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు సెప్టెంబర్ 30 నుండి నవంబర్ 21 వరకు అస్తంగతుడై ఉంటాడు. బృహస్పతి ఫిబ్రవరి 24 నుండి మార్చి 23 వరకు అస్తంగతుడై ఉంటాడు. అక్టోబర్ 30న కుజుడు వక్రగతుడు అవుతాడు మరియు జనవరి 13, 2023న మార్గి అవుతాడు. జూలై 29న బృహస్పతి వక్రగతుడుగా మారి నవంబర్ 24న మార్గీ అవుతాడు. డిసెంబర్ 19, 2021న శుక్రుడు వక్రగతుడుగా మారి, జనవరి 29, 2022న మార్గిగా మారతాడు. శని జూన్ 5న వక్రగతిని పొంది, అక్టోబర్ 23న మార్గి అవుతాడు.
2022 సంవత్సరం ఉద్యోగ జాతకం
ఈ సంవత్సరం, మీన రాశిలో జన్మించిన వారికి, మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. శని గోచారం అనుకూలంగా ఉండటం వలన, వృత్తి పరంగా బాగున్నప్పటికీ, ఆర్థికంగా మరియు కుటుంబ పరంగా సామాన్యంగా ఉంటుంది. ఈ సంవత్సరం ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది. శని గోచారం ఏప్రిల్ వరకు పదకొండవ ఇంట్లో ఉండటం, తిరిగి జులై నుంచి మళ్లీ పదకొండవ ఇంటిలో ఉండడం వలన వృత్తిపరంగా అనుకూలిస్తుంది. ఈ సమయంలో మీరు చేసే పనులు విజయవంతం అవడం వలన మీరు వృత్తిలో అభివృద్ధి సాధిస్తారు. మీ పై అధికారుల నుంచి కానీ, సహోద్యోగుల నుంచి కానీ సహాయ సహకారాలు అందుకుంటారు. ఈ సమయంలో ఏప్రిల్ లోపు వృత్తి పరంగా మార్పులు చోటు చేసుకుంటాయి. కొత్త ఉద్యోగం రావడం కానీ, చేస్తున్న ఉద్యోగంలో పదోన్నతి రావడం కానీ జరుగుతుంది. అయితే ఈ మార్పు ఆర్థికంగా పెద్దగా అనిపించకపోయినా ఎప్పటికీ హోదా పరంగా మీ స్థాయి పెరిగేలా ఉంటుంది. ఈ సమయంలో పని ఒత్తిడి కూడా ఉన్నప్పటికీ మీరు మీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు. ఏప్రిల్ వరకు గురు గోచారం పన్నెండవ ఇంటిలో ఉండటం వలన ఈ సమయంలో శ్రమ అధికంగా ఉంటుంది. అంతేకాకుండా మీరు కొంతకాలం విదేశాల్లో పని చేయవలసి రావచ్చు. విదేశీ యానం చేసినప్పటికీ ప్రారంభంలో అక్కడి పరిస్థితులు మీకు అనుకూలంగా లేకపోవడం వలన కొంత ఇబ్బందికి గురి అయ్యే అవకాశం ఉంటుంది. అయితే శని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీ మిత్రులు కానీ, సహోద్యోగుల గాని సమయానికి సహాయం చేసి మీకు ఉన్న సమస్యలు తొలగిస్తారు. ఈ సమయంలో మూడవ ఇంటిలో రాహు గోచారం కారణంగా మీరు సమస్యలు వచ్చినప్పటికీ ఉత్సాహం తగ్గకుండా పని చేయగలుగుతారు. మీ తోటి వారిని కూడా ఉత్సాహపరిచి వారి విజయానికి కారకులవుతారు. ఏప్రిల్ నుంచి జూలై మధ్యలో శని గోచారం తో పాటుగా గురు రాహువుల గోచారం కూడా అనుకూలంగా ఉండకపోవడంతో ఈ సమయంలో వృత్తి పరంగా కొన్ని సమస్యలను ఎదుర్కుంటారు. ముఖ్యంగా మీరు గతంలో చేస్తానని ఒప్పుకున్న బాధ్యతలను, పనులను సరిగా పూర్తి చేయడంలో విఫలం అవుతారు. దాని కారణంగా మీ పై అధికారుల కోపానికి గురవుతారు. అంతేకాకుండా ఈ సమయంలో చాలా పనులు వాయిదా పడటం కానీ ఆగిపోవడం కానీ జరగటంతో కొంత ఇబ్బందికి గురవుతారు. ఏప్రిల్ నుంచి తిరిగి శని గోచారం పదకొండవ ఇంటికి రావడంతో గతంలో ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభం అవుతాయి. అంతేకాకుండా వృత్తిలో కూడా గతంలో ఉన్న చెడ్డ పేరు తొలగిపోయి అభివృద్ధి సాధ్యమవుతుంది. గతంలో ఆగిపోయిన ప్రమోషన్ కానీ, ట్రాన్స్ఫర్ కానీ ఈ సమయంలో అవుతుంది.
2022 సంవత్సరం ఆర్థిక జాతకం
ఈ సంవత్సరం మీన రాశి వారికి ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది. ఈ సంవత్సరంలో ఎక్కువ కాలం శని గోచారం లాభ స్థానంలో ఉన్నప్పటికీ, గురు మరియు రాహు గోచారం అనుకూలంగా లేకపోవడంతో ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. ఎంత కష్టపడ్డా ఆదాయం పెరుగుదలలో పెద్దగా అభివృద్ధి ఉండకపోవచ్చు. ఒక్కోసారి ఆదాయం వచ్చినప్పటికీ, మళ్లీ ఖర్చు రూపంలో వచ్చిన డబ్బు పోయే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో వీలైనంత వరకు అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవటం మంచిది. అయితే ఏప్రిల్ వరకు రాహువు మరియు శని గోచారం అనుకూలంగా ఉండటంతో ఆదాయం కొంత పెరిగే అవకాశం ఉంటుంది. ఇంటిలో శుభకార్యాల కొరకు కానీ, ఆధ్యాత్మిక కార్యక్రమాల కొరకు డబ్బు ఎక్కువ ఖర్చు పెడతారు. అలాగే కొంత డబ్బు విలాసాల కొరకు కూడా ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ఏప్రిల్ నుంచి జూలై మధ్యలో శని గోచారం పన్నెండవ ఇంట ఉండటంతో ఖర్చు అదుపు తప్పే అవకాశం ఉంటుంది. మీకు వచ్చే ఆదాయం కంటే ఎక్కువ డబ్బు ఖర్చు అవడంతో మిత్రుల నుంచి కానీ, ఆర్థిక సంస్థల నుంచి కానీ డబ్బు అప్పు తీసుకొని అవకాశం ఉంటుంది. రాహు గోచారం రెండవ ఇంట ఉండటంతో ఈ సమయంలో ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. కొన్ని సార్లు గొప్పలకు పోయి డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి, ఇతరుల మాటలను పొంగిపోయి డబ్బు ఖర్చు చేసుకోకుండా పొదుపు చేయడం మంచిది. ఈ సమయంలో కుటుంబ సభ్యుల కొరకు కూడా డబ్బు ఖర్చు చేస్తారు. ఈ సమయంలో ఆదాయం కూడా బాగానే ఉన్నప్పటికీ ఖర్చు ఎక్కువ ఉండటం వలన వచ్చిన ఆదాయాన్ని పొదుపు చేసుకోలేకపోతారు. ఈ సంవత్సరం పెద్ద మొత్తంలో డబ్బు పెట్టుబడి పెట్టాలి అనుకునే వారు కానీ, ఇల్లు కాని, స్థిరాస్తులు కానీ కొనుగోలు చేద్దామనుకునే వారు ఆలోచించి డబ్బు పెట్టుబడి పెట్టడం మంచిది. గురు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి డబ్బు నష్టపోయే అవకాశం ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో సూర్యుని గోచారం అనుకూలంగా ఉండే సమయంలో పెట్టుబడి పెట్టడం వలన నష్టాలు తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.
2022 సంవత్సరం ఆరోగ్య జాతకం
మీన రాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా సామాన్యంగా ఉంటుంది. సంవత్సరమంతా గురువు చాలా అనుకూలంగా లేకపోవడం వలన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ సంవత్సరంలో ఎక్కువ కాలం శని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ తొందరగానే అవి నయమవుతాయి. ఏప్రిల్ వరకు శని మరియు రాహువు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఆరోగ్య విషయంలో అంతగా భయపడాల్సిన అవసరం లేదు. గురు గోచారం పన్నెండవ ఇంట ఉండటం వలన కాలేయం మరియు వెన్నెముక సంబంధిత ఆరోగ్య సమస్యలు ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంటుంది. సరైన విశ్రాంతి తీసుకోవడం వలన ఈ సమస్యలు తొందరగానే తగ్గుతాయి. అంతేకాకుండా ఈ సమయంలో రాహు గోచారం కూడా అనుకూలంగా ఉండడంతో మీరు ఉత్సాహంగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు వచ్చే ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని మానసికంగా ఒత్తిడికి గురి చేస్తాయి. ఏప్రిల్ తర్వాత గురు గోచారం జన్మరాశి పై ఉండటం వలన ఆరోగ్య విషయంలో సరైన శ్రద్ధ తీసుకోకుండా, విశ్రాంతి లేకుండా ఎక్కువ పని చేయడం వలన పైన చెప్పిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని బాధించే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో శని మరియు రాహువు గోచారం కూడా అనుకూలంగా లేకపోవడం వలన ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ సమయంలో దంతాలు, మెడ, తలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. జూలై నుంచి శని గోచారం మళ్లీ 11 ఇంట్లో ఉండటం వలన ఈ ఆరోగ్య సమస్యలు పడతాయి. ఈ సంవత్సరం మధ్యలో అంటే ఏప్రిల్ మరియు జూలై మధ్యలో ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. మిగిలిన సమయంలో ఆరోగ్యం అంతగా ఇబ్బంది కలిగించదు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ సంవత్సరం అంతా కూడా సరైన ఆహారపు అలవాట్లు కలిగి ఉండటం, మరియు ఎక్కువ శారీరక శ్రమ చేయకుండా తగిన విశ్రాంతి తీసుకోవడం అవసరం.
2022 సంవత్సరం కుటుంబ జాతకం
మీన రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం కుటుంబ పరంగా సామాన్యంగా ఉంటుంది. ప్రథమార్ధంలో ఏప్రిల్ వరకు రాహు గోచారం మరియు శని గోచారం అనుకూలంగా ఉండటం వలన ఈ సమయంలో కుటుంబ పరంగా పెద్దగా సమస్యలు ఉండవు. మీ కుటుంబ సభ్యుల సహకారంతో మీ ఆర్ధిక సమస్యల నుంచి బయట పడగలుగుతారు. మీ సోదరులు మరియు బంధుమిత్రులలో మంచి సంబంధం కలిగి ఉంటారు. లాభ స్థానంలో శని గోచారం కారణంగా మీ ఇంటిలో పెద్ద వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. గతంలో వారి ఆరోగ్యం కారణంగా మీకున్న మానసిక ఆందోళన తగ్గుతుంది. రాహు గోచారం ఏప్రిల్ వరకు అనుకూలంగా ఉండడంతో ఈ సమయంలో మీ పనులు ఉత్సాహంగా చేయగలుగుతారు. అలాగే కుటుంబంలో అవసరం ఉన్నవారికి సాయ పడగలుగుతారు. మీ సంతానం ఈ సమయంలో మంచి వృద్ధిలోకి వస్తారు. మీ సంతానం విదేశాల్లో విద్య కొరకు కానీ, ఉద్యోగం కొరకు కానీ ప్రయత్నం చేస్తుంటే, వారి ప్రయత్నం సమయంలో సఫలం అవుతుంది. ఏప్రిల్ నుంచి గురు గోచారం ఒకటవ ఇంట్లో ఉండటం, రాహు గోచారం కుటుంబ స్థానంలో ఉండటం శని గోచారం జూలై వరకు పన్నెండవ ఇంట్లో ఉండటం వలన ఈ సమయంలో కుటుంబంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో అవగాహన రాహిత్యం ఏర్పడటం కానీ, వారు మిమ్మల్ని అపార్థం చేసుకోవడం కానీ జరుగుతుంది. మీరు చేస్తానని చెప్పిన పని చేయకుండా కేవలం మాట వరకే ఉండటంతో వారు మీ మాట పై నమ్మకం ఉంచరు. అంతేకాకుండా ఈ సమయంలో ఉద్యోగరీత్యా వేరే ప్రాంతంలో ఉండాల్సి వస్తుంది. భార్య భర్తలు మనస్పర్థలు ఏర్పడటం కాని, అపార్థాలు ఏర్పడటం కానీ జరగవచ్చు. ఈ సమయంలో మీరు వీలైనంత వరకు ఓపికగా ఎదుటి వారికి అర్థమయ్యేలా మాట్లాడి సమస్యను పరిష్కరించడం మంచిది. అహంకారానికి పోవడంవలన సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. జూలై తరువాత శని గోచారం తిరిగి రావడంతో కుటుంబంలో ఏర్పడిన సమస్యలు తొలగిపోతాయి.
2022 సంవత్సరం వ్యాపారం మరియు స్వయం ఉపాధి
మీనరాశిలో జన్మించిన వ్యాపారస్తులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. సంవత్సరమంతా గురు గోచారం అనుకూలంగా లేకపోవడం వలన వ్యాపారంలో హెచ్చుతగ్గులను చూస్తారు. ఏప్రిల్ వరకు రాహు గోచారం మరియు శని గోచారం అనుకూలంగా ఉండటం వలన వ్యాపార పరంగా కొంత అభివృద్ధి ఉంటుంది. ఈ సమయంలో కొత్త ప్రదేశంలో వ్యాపారం ప్రారంభించడం కానీ, లేదా కొత్త వ్యాపారం ప్రారంభించడం కానీ చేస్తారు. భాగస్వామ్య ఒప్పందాల విషయంలో ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. గురు గోచారం ఏప్రిల్ వరకు పన్నెండవ ఇంట ఉండటం వలన ఈ సమయంలో ఒప్పందాలు చేసుకోకుండా ఉండటమే మంచిది. ఒకవేళ తప్పనిసరిగా చేసుకోవాల్సి వస్తే సూర్యుడి గోచారం అనుకూలంగా ఉన్న నెలల్లో చేసుకోవాలి. ఈ సమయంలో శని లాభ స్థానంలో ఉండటం వలన వ్యాపార అభివృద్ధి పరంగా అనుకూలంగా ఉంటుంది. అయితే ఆర్థికంగా మాత్రం సామాన్యంగా ఉంటుంది. ఒక్కోసారి డబ్బు అధికంగా రావడం, మరోసారి తక్కువగా రావడం జరగవచ్చు. ఏప్రిల్ లో శని పన్నెండవ ఇంటికి మారటం, అలాగే రాహు రెండవ ఇంటికి మారటం వలన ఈ సమయంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. ముఖ్యంగా ఆలోచించకుండా పెట్టిన పెట్టుబడుల నుంచి సరైన ఆదాయం రాకపోవడంతో కొంత ఇబ్బందికి గురవుతారు. ఈ సమయంలో గురు దృష్టి ఏడవ మరియు తొమ్మిదవ ఇంటిపై ఉండటం వలన ఆర్ధిక సమస్యల నుంచి బయటపడటానికి రాజకీయ నాయకులు సహాయం కానీ, లేదా ఆర్థిక సంస్థల సహాయం కానీ తోడ్పడుతుంది. అలాగే ఈ సమయంలో మీ భాగస్వాముల నుంచి కూడా కొంత సహాయం అందే అవకాశం ఉంటుంది. దాని వలన వ్యాపారంలో వచ్చిన సమస్యలు దూరమవుతాయి. జూలై నుంచి తిరిగి శని గోచారం అనుకూలంగా ఉండటంతో వ్యాపారంలో ఉన్న సమస్యలు తొలగి పోవడమే కాకుండా వ్యాపారం అభివృద్ధి లోకి వస్తుంది. స్వయం ఉపాధి ద్వారా జీవనం సాగిస్తున్న వారు, కళాకారులు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను పొందుతారు. శని గోచారం మరియు రాహు గోచారం ఏప్రిల్ వరకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీ పనిలో తీరిక లేకుండా ఉంటారు. అయితే ఆదాయం విషయంలో జాగ్రత్త అవసరం. కొంతమంది మిమ్మల్ని మోసం చేయడం కానీ లేదా ఒప్పందం చేసుకున్న డబ్బుకంటే తక్కువ ఇవ్వడం కానీ చేసే అవకాశం ఉంటుంది. మీ శ్రమకు తగిన ఫలితం పొందటానికి గట్టిగా ప్రయత్నించాల్సి ఉంటుంది. ఏప్రిల్ నుంచి జూలై మధ్యలో శని గోచారం అనుకూలంగా ఉండకపోవడంతో మీరు మీ పని విషయంలో కొంత ఇబ్బంది పడవలసి రావచ్చు. సరైన అవకాశాలు దొరకకపోవడంతో ఖాళీగా ఉండాల్సి రావడం కానీ లేదా తక్కువ డబ్బుకి పనిచేయాల్సి రావడం కానీ కావచ్చు. ఈ సమయంలో ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండటానికి డబ్బు ఖర్చు అదుపు చేసుకోవడం మంచిది. జూలైలో తిరిగి శని గోచారం అనుకూలంగా రావడంతో మీరు మళ్ళీ ఈ పనిలో తీరిక లేకుండా ఉండేలా అవకాశాలు లభిస్తాయి.
2022 సంవత్సరం విద్యార్థులు మరియు వారి చదువు
మీనరాశిలో జన్మించిన విద్యార్థులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ఏప్రిల్ నుంచి జూలై మధ్యలో రాహు మరియు శని గోచారం అనుకూలంగా ఉండటం, గురు దృష్టి నాలుగవ ఇంటి పై పడటం వలన ఈ సమయంలో చదువు బాగా సాగుతుంది. అయితే కొన్నిసార్లు ఏకాగ్రత దెబ్బతినడం కానీ, నిర్లక్ష్యం పెరగడం వల్ల కానీ చదువు పైన శ్రద్ధ తగ్గవచ్చు. ఈ సమయంలో అత్యుత్సాహానికి పోకుండా నిర్లక్ష్యాన్ని వీడి ఉండాల్సి ఉంటుంది దానివలన పరీక్షలలో తక్కువ మార్కులు రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకున్న వారవుతారు. ఏప్రిల్ నుంచి జూలై మధ్యలో శని మరియు రాహు గోచారం అనుకూలంగా లేకపోవడంతో బద్ధకం పెరగడమే కాకుండా, చదవకుండా ఉండటానికి కారణాలు వెతుకుతారు. తక్కువ శ్రమతో పరీక్షల్లో పాస్ అయ్యే మార్గాల కొరకు ప్రయత్నం చేస్తారు. దీనివలన విలువైన సమయాన్ని వృధా చేసినవారవుతారు తప్ప చదువు విషయంలో ఇటువంటి ప్రయత్నాలు ఏ విధంగా ఉపయోగపడవని గమనించాల్సి వుంటుంది. ఈ సమయంలో గురు దృష్టి 9వ ఇంటిపై ఉండటం వలన మీ పెద్ద వారి నుంచి కానీ, గురువుల నుంచి కానీ సరైన మార్గదర్శనం లభించి బద్ధకాన్ని విడిచిపెడతారు. దానివలన పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు. విదేశాలలో ఉన్నత విద్య ప్రయత్నిస్తున్న వారికి సంవత్సర ద్వితీయార్ధంలో అనుకూల ఫలితం లభిస్తుంది. పోటీ పరీక్షలు రాస్తున్న వారికి ఈ సంవత్సరం ప్రథమార్థంలో ఏప్రిల్ వరకు, తిరిగి జూలై తర్వాత అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో వారు అనుకున్న ఫలితాన్ని పొందుతారు.
2022 సంవత్సరం గ్రహదోషములు – పరిహారములు
మీన రాశిలో జన్మించిన వారు, ఈ సంవత్సరం, గురువుకు, శనికి, మరియు రాహువుకు పరిహారాలు ఆచరించడం మంచిది. ఈ సంవత్సరం ప్రథమార్థంలో గురువు 12వ ఇంటిలో సంచరిస్తాడు. దాని కారణంగా ఆర్థిక సమస్యలు గానీ ఆరోగ్య సమస్యలు కానీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతిరోజు గురు స్తోత్ర పారాయణం చేయటం కానీ, గురుచరిత్ర పారాయణం చేయడం కానీ మంచిది. ఏప్రిల్ తర్వాత రాహువు రెండవ ఇంట్లో సంచరిస్తాడు కాబట్టి ఈ సమయంలో రాహువు ఇచ్చే చెడు ఫలితాలు తగ్గటానికి ప్రతిరోజు రాహు స్తోత్ర పారాయణం చేయడం కానీ, దుర్గా స్తోత్రం పారాయణం చేయటం కానీ మంచిది. ఈ సంవత్సరమంతా శని గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ప్రతిరోజు శని స్తోత్రం పారాయణం చేయడం కానీ, లేదా హనుమాన్ స్తోత్ర పారాయణం చేయడం కానీ మంచిది. ఇవే కాకుండా 19,000 సార్లు శని మంత్ర జపం చేయటం కానీ, శని గ్రహ శాంతి హోమం చేయడం మంచిది. శని మనం చేసే కష్టానికి సంతృప్తి చెందుతాడు కాబట్టి, శారీరకంగా కష్టపడటం అంటే పేదవారికి, వృద్ధులకు, వికలాంగులకు సేవ చేయడం అలాగే దానధర్మాలు చేయడం వలన శని ప్రభావం చాలా వరకు తగ్గుతుంది. మీ జాతకంలో పైన చెప్పిన గ్రహాల యొక్క దశ లేదా అంతర్దశలు ఈ సమయములో నడుస్తున్నట్లు అయితే వాటి ప్రభావము అధికంగా ఉంటుంది. పైన చెప్పిన పరిహారములు మీ శక్తి, భక్తి మరియు శ్రద్ధ మేరకు ఏ పరిహారం అయినా పాటించవచ్చు అంతేకానీ చెప్పిన పరిహారములు అన్ని పాటించమని చెప్పడం లేదు. ఈ గ్రహాల పరిహారాలు తో పాటుగా వీలైనంత వరకూ తోచిన విధంగా అవసరం ఉన్నవారికి సేవ చేయడం మంచిది.